rythu nestham foundation

16 Jun

చిరుధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

అతి తక్కువ పెట్టుబడి, స్వల్ప నీటి వినియోగం, కొద్ది రోజుల్లోనే చేతికి వచ్చే పంటలు… చిరుధాన్యాలు. మరి చిరుధాన్యాలను సాగు చేయడం ఎలా ? రైతులే నేరుగా అమ్ముకునే విధానాలేంటి ? బంజరు భూములను సైతం సారవంతం చేసే పద్ధతులేవి ? ఇలా అనేక అంశాలపై రైతున్నలకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ 2019 జూన్ 16న ఆదివారం ఏర్పాటు చేస్తోంది… ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటల సాగు, మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీ, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణా కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్...

02 Jun

భూసార పరిరక్షణ, చీడపీడల నివారణపై రైతు శిక్షణా కార్యక్రమం

సాగు చేసే నేల బాగుంటేనే పంట బాగా పండుతుంది. రైతుకి ఆదాయం దక్కుతుంది. అందుకే.. ప్రతి రైతు ప్రథమ కర్తవ్యం భూసారాన్ని రక్షించుకోవడం. ఈ నేపథ్యంలో మట్టికి పునరుజ్జీవం కల్పించేందుకు పాటించాల్సిన పద్ధతులు ప్రకృతి వ్యవసాయంలో ఉన్న అవకాశాలు తెలుసుకునేందుకు … రండి రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2019

24 Sep

అక్టోబరు 20నాటికి తెలంగాణలో 98 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 98 పత్తి కొనుగోలు కేంద్రాలు తెరువాలని, వచ్చే నెల పదో తేదీలోగా 25 పత్తి కేంద్రాలను తెరవాలని అధికారులను మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఆదేశించారు. 20వ తేదీలోగా 98 కేంద్రాలు అందుబాటులోకి తేవాలని కోరారు. 288 జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. తెలంగాణ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం మార్కెటింగ్, వ్యవసాయ, మార్క్‌ఫెడ్, హాకా, గిడ్డంగుల సంస్థ, సీసీఐ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పత్తి, మక్కజొన్న, పెసర్లు, మినుముల కొనుగోళ్లపై ఆదేశాలు జారీచేశారు. ఖమ్మం జిల్లా నుంచి జిన్నింగ్ మిల్లుల యజమానులు సీసీఐ టెండర్లలో పాల్గొనకపోవడంపై మంత్రి ఆరా తీశారు. ఆ జిల్లాలో రైతులకు ఇబ్బందులు రాకుండా...

18 Sep

హైదరాబాద్‌లో మిద్దెతోటపై అవగాహన సదస్సు

మిద్దెతోటను ప్రారంభించాలని అనుకుంటున్నారా…? ఇంటిపంటలను పండించే మెళకువలు తెలుసుకోవాలని ఉందా…? కూరగాయలు, పండ్లు, తీగజాతి మొక్కలను ఎలా పెంచుకోవాలి…? ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో సెప్టెంబరు 22, 2018 శనివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కేవలం 80 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. హాజరుకాబోయే వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కొరకు 70939 73999 ఫోన్‌ నెంబరును సంప్రదించగలరు. ...

14 Sep

నూనె గింజలకు కనీస మద్దతు ధరపై కేంద్రం కొత్త విధానం

నూనె గింజలు పండించే రైతులకు ఊరటనిచ్చేలా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై కొత్త విధానానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎంఎస్‌పీ కంటే ధరలు పడిపోతే దానికి తగ్గ పరిహారం ఇవ్వడం, అవసరమైతే రాష్ట్రాలే ప్రైవేటు సంస్థల ద్వారా సేకరణ జరిపేలా చూడడం వంటివి దీని ద్వారా సాధ్యమవుతాయి. ‘ప్రధానమంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌’ (పీఎం-ఆశా)పేరిట ఈ పథకాన్ని ఆమోదిస్తూ ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకొంది. రైతులకు కచ్చితంగా ఎంఎస్‌పీ లభించేలా చూస్తామని ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సమర్పించిన ‘అన్నదాత మౌల్య సంరక్షణ యోజన’పై కేబినెట్‌ చర్చించింది. కేబినెట్‌ నిర్ణయం చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని కేంద్ర...

08 Sep

5లక్షల ఎకరాల్లో పెట్టుబడిలేని ప్రకృతి సేద్యం: చంద్రబాబు

రాష్ట్రంలో రైతు ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభలో స్పష్టం చేశారు. ఎంత కరవు పరిస్థితులున్నా 2 కోట్ల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా పూర్తి రాయితీపై విత్తనాలు ఇస్తున్నామని చెప్పారు. పత్తిలో గులాబీరంగు పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉద్ధృతిని గమనిస్తూ ప్రాంతాలవారీగా రైతులకు సూచనలు ఇస్తున్నామని తెలిపారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించడంతోపాటు సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 5 లక్షల ఎకరాల్లో జీరో బడ్జెట్‌ సాగు చేపట్టి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. పెట్టుబడిలేని ప్రకృతిసేద్య విధానంలో ఆవు పంచకం, సున్నపు నీరు చల్లి 3,500 హెక్టార్లలో పంటను కాపాడామని వివరించారు....

07 Sep

రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి

చట్ట సభల్లో 80శాతం రైతు బిడ్డలే ఉన్నప్పటికీ రైతు బాగోగులు ఎవరికి పట్టవని ‘గాంధీపథంలో, కర్షక ప్రధాని’ పుస్తకావిష్కరణ సభలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ‘గాంధీపథంలో, కర్షక ప్రధాని’ అనే పుస్తకాన్ని గుంటూరులోని టొబాకో అసోసియేషన్ హాల్లో గురువారం ఆవిష్కరించారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ పుస్తకాన్ని రైతునేస్తం ఫౌండేషన్‌ ముద్రించింది. చరణ్‌ సింగ్‌ కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అజిత్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. గ్రామీణాభివృద్దితోనే దేశాభివృద్ధి ఆన్న మహాత్మ గాంధీ సిద్ధాంతాన్ని పాలకులు మరిచిపోవటం వల్లే...

30 Aug

అక్టోబరు 1నాటికి పత్తి కొనుగోలు కేంద్రాలు: హరీశ్‌

పత్తి మార్కెటింగ్ సీజన్ కోసం తెలంగాణ సర్కారు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అక్టోబర్ 1 నాటికి పత్తి కొనుగోలు కేంద్రాలను సిద్ధంచేయాలని అధికారులను తెలంగాణ మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. గత ఏడాది మాదిరిగానే జిల్లా కలెక్టర్లు ప్రకటించిన అన్ని కాటన్ జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటుచేయాలని సూచించారు. మద్దతు ధర కల్పించే విషయంలో పత్తి రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ గ్రాండ్‌లో వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, సీసీఐ చైర్మన్ అల్లిరాణి, సీసీఐ సంచాలకుడు చొక్కలింగం, మార్కెటింగ్ సంచాలకురాలు లక్ష్మిబాయి తదితరులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది పత్తి నుంచి దూదిశాతాన్ని సీసీఐ 33 శాతంగా...

18 Aug

సెప్టెంబరు నుంచి ఈ-నామ్‌ ద్వారా చింతపండు కొనుగోళ్లు

ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) పద్ధతిలో చింతపండు కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ మార్కెటింగ్‌శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. రైతు ప్రయోజనాలు, గిట్టుబాటు ధర కల్పన కోసం వ్యవసాయ ఉత్పత్తులను ఏకీకృత జాతీయ మార్కెట్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం రెండేండ్ల కిందట ఈ-నామ్‌ను ప్రారంభించింది. తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్, వరంగల్, బాదేపల్లి, హైదరాబాద్, తిర్మల్‌గిరి వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఎంపికచేసింది. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మలక్‌పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్‌కు ప్రధానంగా వచ్చే మిర్చి పంటను ఈ-నామ్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఎంపికచేసిన మరిన్ని మార్కెట్ కమిటీల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అధికారులు దీని పరిధిలోకి తెచ్చారు. మలక్‌పేట...

17 Aug

ఆంధ్రప్రదేశ్‌లో ఊపందుకున్న వరిసాగు

ఏపీలో వరి సాగు అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పటికే సాధారణ విస్తీర్ణంలో 64 శాతం వరినాట్లు పడ్డాయి. రాష్ట్రంలో వరి విస్తీర్ణం 15.50లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 9.99లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి 8.78లక్షల హెక్టార్లలోనే వరి నాట్లు వేశారు. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న జిల్లాల్లో వరి సాగు జోరుగా సాగుతోంది. వరి కోతకొచ్చే సమయంలో తుఫాన్ల వలన పంట నాశనం కాకుండా ముందస్తు సాగు కోసం ప్రభుత్వం గోదావరి, కృష్ణా డెల్టాలకు జూన్‌ నెలలోనే సాగునీటిని విడుదల చేసింది. వంశధార, నాగావళి ప్రాజెక్టుల నీటినీ సకాలంలో అందించింది. దీంతో శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల రైతులు నైరుతి ప్రవేశించిన తొలినాళ్లలోనే నారు పోశారు. జూలై రెండోవారం...

X