rythu nestham

16 Jun

చిరుధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

అతి తక్కువ పెట్టుబడి, స్వల్ప నీటి వినియోగం, కొద్ది రోజుల్లోనే చేతికి వచ్చే పంటలు… చిరుధాన్యాలు. మరి చిరుధాన్యాలను సాగు చేయడం ఎలా ? రైతులే నేరుగా అమ్ముకునే విధానాలేంటి ? బంజరు భూములను సైతం సారవంతం చేసే పద్ధతులేవి ? ఇలా అనేక అంశాలపై రైతున్నలకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ 2019 జూన్ 16న ఆదివారం ఏర్పాటు చేస్తోంది… ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటల సాగు, మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీ, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణా కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్...

24 Sep

తెలంగాణలో 259 మక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

తెలంగాణలో పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా వానకాలం పంటల కొనుగోలుపై అధికారులతో ఆదివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. మక్కజొన్న నూర్పిళ్లు మొదలైన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. మక్కజొన్నల కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 259 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది 3 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేయగా, ఈసారి సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులు కొనేందుకు సన్నాహాలు చేయాలని సూచించారు. మార్కెట్ ధర తక్కువ ఉన్నప్పటికీ మద్దతు ధర రూ.1,700 ప్రకారమే రైతుల నుంచి నేరుగా కొనుగోలుచేస్తామని వివరించారు.   మినుములు, పెసర్లకు...

08 Sep

5లక్షల ఎకరాల్లో పెట్టుబడిలేని ప్రకృతి సేద్యం: చంద్రబాబు

రాష్ట్రంలో రైతు ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభలో స్పష్టం చేశారు. ఎంత కరవు పరిస్థితులున్నా 2 కోట్ల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా పూర్తి రాయితీపై విత్తనాలు ఇస్తున్నామని చెప్పారు. పత్తిలో గులాబీరంగు పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉద్ధృతిని గమనిస్తూ ప్రాంతాలవారీగా రైతులకు సూచనలు ఇస్తున్నామని తెలిపారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించడంతోపాటు సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 5 లక్షల ఎకరాల్లో జీరో బడ్జెట్‌ సాగు చేపట్టి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. పెట్టుబడిలేని ప్రకృతిసేద్య విధానంలో ఆవు పంచకం, సున్నపు నీరు చల్లి 3,500 హెక్టార్లలో పంటను కాపాడామని వివరించారు....

07 Sep

రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి

చట్ట సభల్లో 80శాతం రైతు బిడ్డలే ఉన్నప్పటికీ రైతు బాగోగులు ఎవరికి పట్టవని ‘గాంధీపథంలో, కర్షక ప్రధాని’ పుస్తకావిష్కరణ సభలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ‘గాంధీపథంలో, కర్షక ప్రధాని’ అనే పుస్తకాన్ని గుంటూరులోని టొబాకో అసోసియేషన్ హాల్లో గురువారం ఆవిష్కరించారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ పుస్తకాన్ని రైతునేస్తం ఫౌండేషన్‌ ముద్రించింది. చరణ్‌ సింగ్‌ కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అజిత్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. గ్రామీణాభివృద్దితోనే దేశాభివృద్ధి ఆన్న మహాత్మ గాంధీ సిద్ధాంతాన్ని పాలకులు మరిచిపోవటం వల్లే...

30 Aug

తెలంగాణలో యాసంగి విత్తన ప్రణాళిక ఖరారు

రాబోయే యాసంగికి విత్తన ప్రణాళికను తెలంగాణ వ్యవసాయశాఖ ఖరారుచేసింది. యాసంగికి 4.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనావేశారు. యాసంగి కోసం 3.16 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంచేయాలని నిర్ణయించారు. 25 వేల క్వింటాళ్లు సిద్ధంగా ఉండగా, విత్తనోత్పత్తి కింద 2.91 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, 64,880 క్వింటాళ్ల శనగలు, 8,666 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సిద్ధంచేశారు. మినుములు, ఆముదం విత్తనాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. శనగ, వేరుశనగ విత్తనాలకు క్వింటాకు 35 శాతం చొప్పున సబ్సిడీ ఇస్తారు. ...

18 Aug

సెప్టెంబరు నుంచి ఈ-నామ్‌ ద్వారా చింతపండు కొనుగోళ్లు

ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) పద్ధతిలో చింతపండు కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ మార్కెటింగ్‌శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. రైతు ప్రయోజనాలు, గిట్టుబాటు ధర కల్పన కోసం వ్యవసాయ ఉత్పత్తులను ఏకీకృత జాతీయ మార్కెట్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం రెండేండ్ల కిందట ఈ-నామ్‌ను ప్రారంభించింది. తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్, వరంగల్, బాదేపల్లి, హైదరాబాద్, తిర్మల్‌గిరి వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఎంపికచేసింది. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మలక్‌పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్‌కు ప్రధానంగా వచ్చే మిర్చి పంటను ఈ-నామ్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఎంపికచేసిన మరిన్ని మార్కెట్ కమిటీల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అధికారులు దీని పరిధిలోకి తెచ్చారు. మలక్‌పేట...

17 Aug

ఆంధ్రప్రదేశ్‌లో ఊపందుకున్న వరిసాగు

ఏపీలో వరి సాగు అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పటికే సాధారణ విస్తీర్ణంలో 64 శాతం వరినాట్లు పడ్డాయి. రాష్ట్రంలో వరి విస్తీర్ణం 15.50లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 9.99లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి 8.78లక్షల హెక్టార్లలోనే వరి నాట్లు వేశారు. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న జిల్లాల్లో వరి సాగు జోరుగా సాగుతోంది. వరి కోతకొచ్చే సమయంలో తుఫాన్ల వలన పంట నాశనం కాకుండా ముందస్తు సాగు కోసం ప్రభుత్వం గోదావరి, కృష్ణా డెల్టాలకు జూన్‌ నెలలోనే సాగునీటిని విడుదల చేసింది. వంశధార, నాగావళి ప్రాజెక్టుల నీటినీ సకాలంలో అందించింది. దీంతో శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల రైతులు నైరుతి ప్రవేశించిన తొలినాళ్లలోనే నారు పోశారు. జూలై రెండోవారం...

10 Aug

మక్కకు విదేశీ తెగులు! కర్ణాటకలో గుర్తించిన శాస్త్రవేత్తలు

ఉత్తర అమెరికాకి చెందిన ఫాల్‌ ఆర్మీవామ్ కీటకం భారత్‌లోకి ప్రవేశించినట్లుగా కర్ణాటకలోని శివమొగ్గలో ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కత్తెర పురుగుగా పిలిచే ఈ కీటకం శాస్త్రీయ నామం స్పోడోప్టెరా ప్రూగి పెడ్రా అని పేర్కొన్నారు. మక్క కంకితోపాటు దాని చొప్పబెండును కూడా పిప్పి చేయడం దీని ప్రత్యేకతని వెల్లడించారు. అతి ప్రమాదకరమైన తెగులు ఆసియాలోనే తొలిసారిగా కర్ణాటకలోని శివమొగ్గలో ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణాఫ్రికానుంచి మొదలు 2016లో దక్షిణాఫ్రికాను వణికించిన కత్తెర పురుగు అక్కడ్నుంచి ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఏడాది కిందట ఘనాలో అత్యవసర పరిస్థితికి కారణమైంది. కనిపించిన పంటనల్లా కత్తిరించుకుంటూ పోయే ఇది.. ఆహార భద్రతకే సవాల్‌ విసురుతోంది. ఇప్పుడు భారత్‌లోనూ ఉనికిని చాటుతోంది. ఇంగ్లాండులోని కామన్‌వెల్త్‌ అగ్రికల్చర్‌ బ్యూరో ఇంటర్నేషనల్‌(సీఏబీఐ)...

10 Aug

తెలంగాణలో రాయితీపై వ్యవసాయ యంత్రాలు: మంత్రి పోచారం

వరిసాగులో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వరి పరిశోధనాకేంద్రంలో గురువారం యంత్రాలతో వరినాట్లు వేసేవిధానాన్ని వీసీ డాక్టర్ వీ ప్రవీణ్‌రావు, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డితోపాటు వివిధ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. స్వయంగా వరినాట్లు వేసే యంత్రాన్ని నడిపి నాట్లువేసే పద్ధతిని చూపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూలీలతో కంటే యంత్రాలతో నాట్లువేయడం వల్ల సమయం, ఖర్చుకూడా ఆదా అవుతుందని తెలిపారు. కూలీల కొరత వ్యవసాయరంగానికి, రైతులకు ఎంతో ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. యంత్రాలతో నాట్లు వేసేందుకు వీలుగా వరినారును పెంచడంపై...

10 Aug

తెలంగాణలో గొర్రెల పంపిణీకి మరో 5 వేల కోట్లు!

తెలంగాణలో గొర్రెల పంపిణీని ఇప్పటికే రూ.5 వేల కోట్లతో చేపట్టామని, అవసరమైతే మరో రూ.5 వేల కోట్లు ఇవ్వటానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పశు సంవర్ధకశాఖపై గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ప్రోత్సహించటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందన్నారు. విభిన్న కార్యక్రమాల అమలుతో తెలంగాణ పశుసంవర్ధకశాఖకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని వివరించారు. బర్రెల పంపిణీ పథకాన్ని ఈ నెల 11న ప్రారంభిస్తామన్నారు. గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్ సొమ్మును బీమా సంస్థలు ఇవ్వడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు. గొర్రెలు,...

X