rythuneshtam foundation

01 Sep

మిరప, వరి సాగు | కషాయాలు, మిశ్రమాల పై శిక్షణా కార్యక్రమం

వరి, మిరప సాగులో తక్కువ పెట్టుబడి, నాణ్యమైన దిగుబడి, మార్కెట్లో అధిక రాబడి కి ప్రకృతి, సేంద్రియ వ్యవసాయమే ఉత్తమ విధానం. మరి ఈ పద్ధతిలో సాగేదెలా ? ఉపయోగించే కషాయాలు, మిశ్రమాలేవి ? తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు .. రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఈ...

11 Aug

ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగుపై శిక్షణ కార్యక్రమం

ఆహారంపై పెరుగుతున్న…… అవగాహన సహజ ఆహారం వైపు ప్రజలు. ప్రకృతి సిద్ధంగా పెంచిన కూరగాయలు, ఇతర పదార్ధాలకు డిమాండ్ మరి మీరు ఆ ఆదరణను అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నారా ? ప్రకృతి సేద్యం ద్వారా కూరగాయలు సాగు చేయాలని చూస్తున్నారా ? అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగుపై శిక్షణ, ఉద్యాన శాఖ అందించే రాయితీలపై అవగాహన కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2019 ఆగస్టు 11న ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. గుంటూరు జిల్లా నందివెలుగు రైతు మీసాల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని… రైతులకు శిక్షణ...

30 Jun

సేంద్రియ సాగులో మిరప, పత్తి, వరిసాగుపై రైతు శిక్షణ

తొలకరి పలకరించింది… నేల తల్లి పులకరించింది. కానీ.. పొలం బాట పట్టిన రైతన్నలను పెట్టుబడులు కలవరపెడుతున్నాయి ఈ నేపథ్యంలో.. అతి తక్కువ పెట్టుబడితో కూడిన సేంద్రియ వ్యవసాయమే ఉత్తమ ప్రత్యామ్నాయం. ఈ విధానంలో మిరప, ప్రత్తి, వరి సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఏర్పాటు చేస్తోంది ప్రత్యేక శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా

25 Oct

మిద్దెతోటలతో రసాయనిక ఆహారం నుంచి విముక్తి : తెలంగాణ సీఎస్ ఎస్‌.కె. జోషి

పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార అవసరాలను మిద్దెతోటల పెంపకం ద్వారా తీర్చే అవకాశాలు ఉన్నాయని, మిద్దెతోటల పెంపకమే సర్వత్రా శ్రేయస్కరమని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.కె. జోషి చెప్పారు. రసాయనాలు, క్రిమిసంహారక మందుల వినియోగం లేకుండా కూరగాయలు, పండ్లు, పూలను సాగుచేసుకోవడం ద్వారా ఆహార అవసరాలను తీర్చుకోవడమే కాకుండా వివిధ వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చన్నారు. బుధవారం హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రాష్ట్ర ఉద్యానవనశాఖ, రైతునేస్తం ఆధ్వర్యంలో మిద్దెతోటల సాగు, వర్టికల్ గార్డెనింగ్‌పై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు జరిగింది. మిద్దెతోటల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేయూత అందిస్తోందని ఎస్‌.కె.జోషి తెలిపారు. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మిద్దెతోటల సాగుపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. రైతునేస్తం...

23 Sep

వరి, కూరగాయల సాగుపై రైతుశిక్షణా కార్యక్రమం

ప్రకృతి సేద్యంపై ఆసక్తి ఉందా ? సహజ సాగు పద్ధతిలో.. వరి, కూరగాయలు పండించే విధానాలు తెలుసుకోవాలా ? చీడపీడలు, తెగుళ్లను నివారించే పద్ధతులపై సందేహాలున్నాయా…? అయితే రండి… మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, కూరగాయల సాగుపై రైతుశిక్షణా కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2018 సెప్టెంబర్ 23న ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీమతి లావణ్య రమణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖాధికారి రాజా కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని… రైతులకు శిక్షణ ఇస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాలను వివరిస్తారు. ఉద్యానవనశాఖ అందించే రాయితీ వివరాలను తెలియజేస్తారు. అనంతరం శిక్షణ...

09 Aug

ఆంధ్రప్రదేశ్‌లో కరువు మండలాల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం రాత్రి కరువు మండలాలను ప్రకటించింది. ఆరు జిల్లాల్లోని 274 మండలాలు తీవ్రంగా, ఒక మండలం ఓ మోస్తరుగా కరువు బారిన పడినట్టు పేర్కొంటూ రెవెన్యూ శాఖ గెజిట్ విడుదల చేసింది. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావానికి గురైన ప్రాంతాల ఆధారంగా కరువు మండలాలను గుర్తించారు. సీజన్ ప్రారంభంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఉన్న మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలనేది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకం. దాని ప్రకారం ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ జాబితాను విడుదల చేశారు. ఆరు జిల్లాల్లో జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం 245.0మి.మీ.కు 214.8మి.మీ (302% తక్కువ)నమోదైంది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల...

X