rythunestham farmer training

15 Sep

పుట్టగొడుగుల పెంపకంపై రైతు శిక్షణా కార్యక్రమం

వ్యవసాయ అనుబంధ రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు అవగాహనతో అందిపుచ్చుకుంటే పొందవచ్చు మంచి లాభాలు ఈ జాబితాలో మేలైన మార్గం పుట్టగొడుగుల పెంపకం అధిక పోషకాలు కలిగిన పుట్టగొడుగలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఈ నేపథ్యంలోకొత్తగా పుట్టగొడుగల పెంపకంలోకి అడుగుపెట్టాలని అనుకునేవారితో పాటు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న వారికి రైతునేస్తం చక్కని అవకాశం కల్పిస్తోంది. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే...

16 Jun

చిరుధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

అతి తక్కువ పెట్టుబడి, స్వల్ప నీటి వినియోగం, కొద్ది రోజుల్లోనే చేతికి వచ్చే పంటలు… చిరుధాన్యాలు. మరి చిరుధాన్యాలను సాగు చేయడం ఎలా ? రైతులే నేరుగా అమ్ముకునే విధానాలేంటి ? బంజరు భూములను సైతం సారవంతం చేసే పద్ధతులేవి ? ఇలా అనేక అంశాలపై రైతున్నలకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ 2019 జూన్ 16న ఆదివారం ఏర్పాటు చేస్తోంది… ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటల సాగు, మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీ, అటవీ చైతన్య ద్రావణం తయారీపై రైతు శిక్షణా కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్...

09 Jun

కూరగాయల సాగు, కషాయాల తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

కూరగాయల సాగులో తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి పంటకు మంచి ఆదాయం సాగులో శ్రమకు తగ్గ ఫలితం పొందాలని అనుకుంటున్నారా ? అయితేరండి మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోన్న.. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు, వివిధ రకాల కషాయాల తయారీపై రైతు శిక్షణా కార్యక్రమానికి హాజరుకండి

09 Dec

గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరులో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు

అనారోగ్య సమస్యలతో బాధలా? బాగు చేసే మార్గం కోసం చూస్తున్నారా ? ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసం వెతుకుతున్నారా ? అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారిచే సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరు నగరాల్లో ఈ కార్యక్రమాల్లో కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని సిరిధాన్యాలు, కషాయాలతో షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తదితర రోగాల నిర్మూలన, నియంత్రణపై అవగాహన కల్పిస్తారు….. కార్యక్రమాల తేదీలు, వేదికలు…. ☛ గూడూరులో… డిసెంబర్ 9 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వేదిక : దవ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాల్, ఐ.సి.ఎస్. రోడ్, గూడూరు

17 Oct

ప్రకృతి వ్యవసాయ విధానంలో రబీలో సిరిధాన్యాల సాగుపై శిక్షణ

తరగని పోషక గనులు ఆరోగ్య సిరులకు నిలయాలు సిరిధాన్యాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సాగయ్యే రైతునేస్తాలు.. ఈ పంటలు ఈ నేపథ్యంలో.. సిరిధాన్యాలను సాగు చేయాలని ఆసక్తి ఉన్న రైతుల కోసం రైతునేస్తం ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది.

20 Sep

పరిహారం ఆలస్యం చేస్తే బీమా కంపెనీలకు జరిమానా

పంటల బీమా సొమ్ము కోసం ఎదురుచూసే రైతులకు శుభవార్త. బీమా క్లెయిమ్‌ సెటిల్‌ చేయకుండా ఆలస్యం చేస్తూ రైతులను ఏడిపించే పరిస్థితికి కేంద్రం అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 19న కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులకు బీమా పరిహారం క్లెయిమ్స్‌ సెటిల్‌ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలు, సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేస్తూ ఆయా రాష్ట్రాలకు పంపించింది. సెటిల్‌మెంటు చేయడంలో నిర్ణీతకాల పరిమితి రెండు నెలలు దాటితే 12 శాతం వడ్డీ రైతులకు చెల్లించాలని బీమా కంపెనీలను ఆదేశించింది. అలాగే కంపెనీల విన్నపం మేరకు తమ వాటా సబ్సిడీ...

02 Sep

ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో భూసార పరిరక్షణపై అవగాహన

నేలతల్లి రైతుకి జీవనాధారం పంటలకు ఆధారం అందుకే.. వ్యవసాయంలో భూ పరిరక్షణే ప్రధానం మరి భూసార రక్షణ ఎలా ?   సేంద్రియ, ప్రకృతి విధానాలేంటి ? ఈ సందేహాలకు సమాధానం, విలువైన సమాచారం కోసం రండి… ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో భూసార పరిరక్షణ మరియు చీడపీడల నివారణకు సులువైన మార్గాలపై రైతునేస్తం ఫౌండేషన్ సెప్టెంబర్ 2న ఏర్పాటు చేస్తోన్న అవగహనా కార్యక్రమానికి హాజరుకండి. భూసార పరిరక్షణలో మేలైన పద్ధతులు తెలుసుకోండి. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు కె రామచంద్రం పాల్గొని.. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో భూసార సంరక్షణ మరియు చీడ పీడల నివారణకు సులువైన మార్గాలపై అవగాహన...

16 Aug

ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగు శిక్షణ

పత్తి, మిరప సాగు చేస్తున్న రైతులా ? మేలైన సస్యరక్షణ చర్యల కోసం చూస్తున్నారా ? అయితే రండి… మీ కోసమే రైతునేస్తం ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2018 ఆగస్టు 19న ‍‍(ఆదివారం‌‌‌) ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణలో మహబూబ్ నగర్ జిల్లా ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీమతి లావణ్య పాల్గొని.. ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగు విధానాలను వివరిస్తారు. విజయవాడకు చెందిన రహమతుల్లా…. వివిధ పంటల్లో చీడపీడల నివారణలో లింగార్షక బుట్టల ప్రాముఖ్యతను, పత్తిలో గులాబి...

X