rythunestham founation

18 Nov

సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై రైతు శిక్షణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2018 నవంబర్ 18 ఆదివారం సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల తయారీ విధానంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రైతు కొప్పుల శ్రీలక్ష్మీ పాల్గొని రైతు స్థాయిలో సేంద్రియ విధానంలో పుట్టగొడుగుల తయారీపై శిక్షణ ఇస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి. ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు 83675 35439, 97053 83666, 96767 97777, 0863-2286255 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ...

31 Oct

హైదరాబాద్‌లో మిద్దెతోటపై అవగాహన కార్యక్రమం

మిద్దెతోటను ప్రారంభించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…? కుండీలు, బకెట్లు, డ్రమ్ముల్లో ఇంటిపంటలను ఎలా పండించుకోవాలి…? మొక్కలకు సోకే చీడపీడలు, తెగుళ్లను నివారించే పద్ధతులేంటి…? ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో నవంబరు 03, శనివారం టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్‌లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బకెట్ గార్డెన్ నిపుణులు రవిచంద్ర పాల్గొంటారు. సేంద్రియ పద్ధతిలో ఇంటి పంటల పెంపకం విధానాలను వివరిస్తారు. మిద్దెతోటలపై సందేహాలను నివృత్తి చేస్తారు. రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిద్దెతోటను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. మిద్దెతోట చేపట్టేందుకు అవసరమైన...

04 Oct

సికింద్రాబాద్‌, హన్మకొండ, కరీంనగర్‌లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై సదస్సులు

ఆధునిక ఆహారపు అలవాట్లు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. సరైన పోషకవిలువలు అందక చాలామందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. ఈ పరిస్థితులను అధిగమించే ఏకైక మార్గం సిరిధాన్యాలు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా రైతునేస్తం ఫౌండేషన్ మరియు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం” పై ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి గారిచే హైద్రాబాద్, హనుమకొండ, కరీంనగర్‌లో సదస్సులు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్: తేదీ- అక్టోబరు 7 ఆదివారం, మ. 2 గంటల నుండి సా. 5.30 వరకు, వేదిక- హరిహరా కళాభవనం, సికింద్రాబాద్ మరిన్ని వివరాలకు – 70939 73999, 9676797777, 9959343749 హన్మకొండ:

14 Sep

2024 నాటికి ఏపీలో 60 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం

వ్యవసాయ, అనుబంధ రంగాలలో సాంకేతికతను మేళవింపు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఈ-రైతు, ఈ-నామ్‌, రైతు ఉత్పత్తిదారుల సంఘాలన్నిటికీ ఒకే వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్‌ మార్కెట్‌ వ్యవస్థ కోసం మాస్టర్‌ కార్డు రూపొందించిన ఈ-రైతు డిజిటల్‌ మార్కెట్‌ వ్యవస్థను ఆయన బుధవారం ఉండవల్లి ప్రజావేదికలో ఆవిష్కరించారు. కొనుగోలుదారు, రైతు ఉత్పత్తిదారు సంఘాల మధ్య నేరుగా లావాదేవీల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దీన్ని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. మన రైతులు తమ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విక్రయించుకోవడానికి ఈ వ్యవస్థ దోహద పడుతుందన్నారు. దీన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. మనం తినేది ఎరువులు, పురుగుమందుల ఆహారమే ఎరువులు,...

30 Aug

తెలంగాణలో యాసంగి విత్తన ప్రణాళిక ఖరారు

రాబోయే యాసంగికి విత్తన ప్రణాళికను తెలంగాణ వ్యవసాయశాఖ ఖరారుచేసింది. యాసంగికి 4.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనావేశారు. యాసంగి కోసం 3.16 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంచేయాలని నిర్ణయించారు. 25 వేల క్వింటాళ్లు సిద్ధంగా ఉండగా, విత్తనోత్పత్తి కింద 2.91 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, 64,880 క్వింటాళ్ల శనగలు, 8,666 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సిద్ధంచేశారు. మినుములు, ఆముదం విత్తనాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. శనగ, వేరుశనగ విత్తనాలకు క్వింటాకు 35 శాతం చొప్పున సబ్సిడీ ఇస్తారు. ...

09 Aug

భారీగా పెరిగిన పత్తి ధర, క్వింటాలుకు రూ. 6వేలు

పత్తిధర రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం 56మంది రైతులు 271 క్వింటాళ్ల పత్తి తీసుకురాగా క్వింటాలుకు గరిష్ఠంగా రూ.6033, కనిష్ఠంగా రూ. 4821, సగటున రూ. 6011 చొప్పున ఈ-నామ్‌లోని ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో వ్యాపారులు నమోదుచేశారు. నెలక్రితం క్వింటాలుకు రూ. 5200 నుంచి రూ. 5400 మధ్య ఉన్న ధర కొద్దిరోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. పత్తి సీజన్‌ గతేడాది నవంబరులో ప్రారంభంకాగా రెండునెలల్లోనే సగానికిపైగా పత్తిని రైతులు మార్కెట్లో విక్రయించారు. కొద్దిమంది రైతులు మాత్రం పత్తిధర పెరుగుదలకోసం ఎదురుచూస్తూ ఇళ్లలోనే పత్తిని నిల్వ ఉంచుకున్నారు. ప్రస్తుతం అలాంటి వారికి పెరిగిన ధరతో లాభం చేకూరుతోంది. ...

06 Aug

వరంగల్‌లో మిద్దెతోటపై అవగాహన సదస్సు

ఆధునిక యుగంలో తినే ఆహార పదార్థాల నుంచి పీల్చే గాలి వరకు అన్నీ కలుషితమవుతూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వరంగల్‌జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ ఉషా అన్నారు. ఆదివారం రైతునేస్తం ఫౌండేషన్‌, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్‌ సమావేశం మందిరంలో మిద్దెతోటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మిద్దెతోటల నిర్వహణ ఇతర పద్ధతులను వివరించారు. అనంతరం మిద్దెతోట పెంపకానికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉషా మాట్లాడుతూ.. సేంద్రియ ఎరువులను ఉపయోగించి ఇంటిపై కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను పెంచుకోవచ్చని తెలిపారు. స్వచ్ఛమైన ఆక్సిజన్‌తోపాటు క్రిమి సంహారక మందులు వాడని కూరగాయలు, పండ్లు లభిస్తాయని వివరించారు. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే కూరగాయలలో విషపూరితమైన పదార్థాలుంటున్నాయని పేర్కొన్నారు. వీటిని నివారించేందుకు...

01 Aug

పంట మార్పిడితో ఎన్నో ప్రయోజనాలు

రైతులు తమ పంట పొలాల్లో ఒకే రకమైన పంటలను సాగు చేయడంవల్ల రోగాలను కలిగించే పురుగుల సంఖ్య బాగా పెరిగిపోయి రోగాల బెడద తీవ్రమవుతుంది. అలాగే పంట మొక్కలు భూమిలోని ఒకే లోతు పొరల నుంచి పోషకాలను స్వీకరిస్తాయి. కాబట్టి పోషకాలు తగ్గుతాయి. పంటల దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. అందుకే ఒకే రకమైన పంటలను వరుసగా సాగు చేయడానికి బదులు పంట మార్పిడి పద్ధతులు అవలంబిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. చీడపీడల నియంత్రణ ఒక పంటను ఒకే పొలంలో వరుసగా పండించడం వల్ల చీడపీడల ఉధృతి అధికమయ్యే పరిస్థితులు ఏర్పడుతాయి. పురుగు జీవిత చక్రం నిరాటంకంగా ముగించుకొని తీవ్రమైన హాని కలిగించే స్థితికి చేరుకుంటుంది. పంట మార్పిడి చేసినప్పుడు పురుగు జీవిత చక్రం...

01 Aug

అంతర పంటలతో వేరుశనగకు రక్షణ

ఆంధ్రప్రదేశ్‌లో వేరుశనగను 75శాతం వర్షాధారంగానే సాగుచేస్తున్నారు. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో, తేలికపాటి ఎర్రనేలల్లోనూ బెట్ట పరిస్థితులు సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో విత్తిన గింజలుకూడా మొలకెత్తని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో పూర్తిగా వేరుశనగపైనే ఆధారపడకుండా అంతర, అంచు, ఆకర్షక పంటలను కూడా వేసుకుంటే ప్రధాన పంటకు రక్షణతోపాటు అదనపు ఆదాయం, అధిక పశుగ్రాసం పొందే వీలుంటుంది. ఎర్రగొంగలళి, బీహారి పురుగుల నివారణ…. కంచె పంటలుగా విత్తే జొన్న, సజ్జలో అలసందను మిశ్రమ పంటగా విత్తుకోవచ్చు. అలసంద ఎర్ర గొంగళి, బీహారి గొంగళి పురుగులను ఆకర్షించి ప్రధాన పంటను కాపాడుతుంది. అలసందకు బదులుగా తీగజాతి కూరదోసను కూడా సాగు చేసుకోవచ్చు. ఎకరాకు కిలో అలసంద లేదా 100 గ్రాముల కూరదోస విత్తనాలు సరిపోతాయి.

29 Jul

Training on ”Organic Mushroom Farming”

Farmer friend Rythunestham foundation conducting trainig class about ”Organic Mushroom Farming”. The Event is Scheduled on July 29, 2018 (Sunday). The program will be held at the farmer training center Near Pulladigunta Village, Kornepadu Post, Vatticherukuru Mandal, Guntur District, Andhra Pradesh. Krishna District farmer venkateshwarlu, scientists B. Venkateshwarlu ( Krishi vignana kendram, Garikapadu, Krishna District ) will attend this program and will give valuable suggestions and techniques on Mushroom farming. Certificates will be given to farmers attended to program. Training...

X