rythunestham

14 Feb

భూమి బాగుపడితేనే రైతు బాగుపడతాడు

ప్రపంచం మొత్తాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య కాలుష్యం. ప్రజల జీవనసరళి మారటం మరియు అనేక రకాల కారణాల వలన రోజురోజుకి వాతావరణ కాలుష్యం పెరుగుతుందనేది అందరూ అంగీకరించేదే. ప్రజలు అవసరాలను ప్రక్కకు నెట్టి అనుకరణలకు ప్రాముఖ్యతను ఇస్తూ అనవసర వస్తు వినియోగం పెంచడం, పారిశ్రామికీకరణ విపరీతంగా పెరగడం, జనాభా పెరగడం,

06 Feb

రైతుకి సాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’

రైతుకు పెట్టుబడి సాయానికి ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని ప్రకటించింది. ఇందుకోసం 2019-20 బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించింది. అప్పుల ఊబిలో ఉన్న కర్షకులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు 2014లో సర్కారు...

03 Feb

ప్రకృతి వ్యవసాయంలో పండ్లతోటలు, కూరగాయల సాగుపై శిక్షణ

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2019 ఫిబ్రవరి 3న ఆదివారం ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండ్ల తోటలు, కూరగయాల సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి, డాక్టర్ వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్న గూడెం సీనియర్ సైంటిస్ట్ ఎక్స్ టైన్షన్ అండ్ హెడ్ శ్రీమతి డాక్టర్ కరుణశ్రీ పాల్గొని… ప్రకృతి వ్యవసాయ విధానంలో పండ్ల తోటలు, కూరగాయల సాగుపై శిక్షణ ఇస్తారు. శిక్షణలో భాగంగా కషాయాలు, మిశ్రమాల తయారీని వివరిస్తారు. ఉద్యానశాఖ అందించే రాయితీపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమం ఉదయం 10...

02 Feb

కేంద్ర బడ్జెట్ లో రైతుకి జై.. ఏడాదికి రూ.6 వేల పెట్టుబడి పథకం

రైతునేస్తం: కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేసింది. తెలంగాణ ప్రభుత్వ బాటలోనే కేంద్రం కూడా రైతుబంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టనుందన్న అంచనాలను నిజం చేస్తూ.. తాజా బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 5 ఎకరాల లోపు (2 హెక్టార్లు) సాగు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయం అందించనుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలోకి బదిలీ చేస్తామని బడ్జెట్ లో పేర్కొంది. 2018...

09 Dec

గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరులో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు

అనారోగ్య సమస్యలతో బాధలా? బాగు చేసే మార్గం కోసం చూస్తున్నారా ? ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసం వెతుకుతున్నారా ? అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారిచే సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరు నగరాల్లో ఈ కార్యక్రమాల్లో కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని సిరిధాన్యాలు, కషాయాలతో షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తదితర రోగాల నిర్మూలన, నియంత్రణపై అవగాహన కల్పిస్తారు….. కార్యక్రమాల తేదీలు, వేదికలు…. ☛ గూడూరులో… డిసెంబర్ 9 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వేదిక : దవ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాల్, ఐ.సి.ఎస్. రోడ్, గూడూరు

04 Nov

చిరుధాన్యాల సాగు, మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీపై రైతు శిక్షణ కార్యక్రమం

చిరుధాన్యాల సాగు పద్ధతులు తెలుసుకోవాలని ఉందా…? అటవీ చైతన్య ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలి…? మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి…? ఈ ప్రశ్నలకు సమాధానం అందిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘రైతు శిక్షణా కేంద్రం’లో నవంబర్ 4 ఆదివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కృషిరత్న, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్ వలిగారి మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీ మరియు అటవీ చైతన్య ద్రావణం తయారీ విధానం మరియు చిరుధాన్యాల సాగుపద్ధతిపై శిక్షణ ఇస్తారు. కృషిరత్న డాక్టర్‌ ఖాదర్ వలి గారి అనుయాయి, సహజ వ్యవసాయ పద్దతి నిపుణుడు, మైసూరుకు చెందిన బాలన్ బృందం రైతులకు అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణా కార్యక్రమం...

31 Oct

హైదరాబాద్‌లో మిద్దెతోటపై అవగాహన కార్యక్రమం

మిద్దెతోటను ప్రారంభించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…? కుండీలు, బకెట్లు, డ్రమ్ముల్లో ఇంటిపంటలను ఎలా పండించుకోవాలి…? మొక్కలకు సోకే చీడపీడలు, తెగుళ్లను నివారించే పద్ధతులేంటి…? ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో నవంబరు 03, శనివారం టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్‌లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బకెట్ గార్డెన్ నిపుణులు రవిచంద్ర పాల్గొంటారు. సేంద్రియ పద్ధతిలో ఇంటి పంటల పెంపకం విధానాలను వివరిస్తారు. మిద్దెతోటలపై సందేహాలను నివృత్తి చేస్తారు. రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిద్దెతోటను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. మిద్దెతోట చేపట్టేందుకు అవసరమైన...

29 Oct

దేశీయ ఆహారం, ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలనపై సదస్సు

సిరిధాన్యాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలని ఉందా…? కషాయాలతో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని అనుకుంటున్నారా…? నిజమైన దేశీయ ఆహార పదార్థాలేమిటో తెలియక అయోమయంలో ఉన్నారా…? అయితే రండి. రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమానికి హాజరుకండి. అక్టోబరు 29, సోమవారం హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో పిల్లర్ నెం. 83 సమీపంలో కొణిజేటి ఎన్‌క్లేవ్‌లోని పల్లవి గార్టెన్స్‌లో సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వతంత్ర శాస్త్రవేత్త, కృషిరత్న డాక్టర్‌ ఖాదర్ వలి పాల్గొని దేశీయ ఆహారం, ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు. సిరిధాన్యాలైన అండు కొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, ఆరికలు, వ్యవసాయ...

27 Oct

శాస్త్రీయ ప్రగతి ఫలాలు వ్యవసాయరంగానికి అందిస్తాం: ప్రధాని మోదీ

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని అన్నదాతలు చక్కగా అందిపుచ్చుకుంటారన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌ లక్నోలో మూడురోజులపాటు జరిగే ‘కృషి కుంభ్‌’ సదస్సు ప్రారంభోత్సవంలో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. ‘విత్తనం నుంచి విపణి’ వరకు రైతుల కోసం… వారి ఉత్పత్తుల కోసం అత్యంత పటిష్ఠమైన మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. సమీప భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా పంటపొలాల్లో పెద్దసంఖ్యలో సౌరశక్తితో పనిచేసే పంపులు ఏర్పాటవుతాయన్నారు. వారణాశిలో వరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. శాస్త్రీయ ప్రగతి ఫలాలు వ్యవసాయరంగానికి అందేలా చూడటానికి తమ...

X