rythunestham

08 Jun

సిరిధాన్యాల ఆహారంపై ఉచిత అవగాహనా కార్యక్రమం@హైదరాబాద్

సమతుల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం అవుతుంది. మరి ఆ సమతుల్యత లభించాలంటే.. ఏ ఆహారం తీసుకోవాలి ? ఎంత మోతాదులో తినాలి ? బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయం లేవా ? ఈ ప్రశ్నలకు, సందేహాలకు సమాధానలు అందించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది “సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం”పై ఉచిత అవగాహన కార్యక్రమం. స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి ఈ కార్యక్రమంలో పాల్గొని చిరు ధాన్యాల విధానాలు, వాటితో కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. జూన్ 15 శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. వేదిక… హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఉన్న విశ్వేరయ్య భవన్ లోని ఇన్...

08 Jun

రైతుల ఆదాయ రెట్టింపుకి “కృషి కళ్యాణ్ అభియాన్”

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఏడాది “కృషి కళ్యాణ్ అభియాన్” కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూన్ 1 నుంచి 31 జూలై వరకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తగిన రాయితీలు ఇస్తూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కేంద్రం ఈ విధానానికి రూపకల్పన చేసింది. పథకం విధానాలు, అమలు ఇలా… దేశవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 111 జిల్లాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. ఒక్కో జిల్లాలో వెయ్యికిపైగా జనాభా ఉన్న 25 గ్రామాల్లో కృషి కళ్యాణ్ అభియాన్ ని అమలు చేస్తారు. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ వీటిని...
07 Jun

ప్రకృతి సేద్యంతోనే సిరులు, సంతృప్తి

జీవవైవిధ్యంలో వ్యవసాయానిది ప్రధాన పాత్ర. నీరు, భూమి, వాతావరణ పరిస్థితులు పంటలకు కీలకం. వీటిలో ఉండే పోషకాలు, సూక్ష్మ జీవులే పంటల ఎదుగుదల, ఉత్పాదకతలో ముఖ్య భూమిక పోషిస్తాయి. సహజంగా లభించే ఆ వనరులను సక్రమంగా వినియోగించుకుంటు చేసేదే ప్రకృతి వ్యవసాయం. రసాయనాలు లేని ఈ సాగు పద్ధతితో రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది. పర్యావరణం పదిలంగా ఉంటుంది. జీవవైవిధ్యం కళకళలాడుతుంది. ఇలా సేద్యంలో సహజ పద్ధతులను పాటిస్తు అనేక మంది రైతులు నేలతల్లిని కాపాడుకోవడమే కాకుండా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ కోవకే చెందుతారు నల్గొండ పట్టణానికి చెందిన ఎదుళ్ల అంజిరెడ్డి. 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో గత రెండేళ్లుగా పూర్తి సేంద్రీయ పద్ధతిలో బత్తాయి, నిమ్మ, సపోట, మునగ, ఉసిరి,...

06 Jun

తెలంగాణలో ప్రారంభమైన రైతు బీమా సర్వే

రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే రైతుబంధు పేరుతో రైతులకి ఎకరానికి ఏడాదికి రూ.8 వేల పెట్టుబడి సహాయం ఇచ్చే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ. 5 లక్షల రైతు బీమా పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా… రాష్ట్రవ్యాప్తంగా రైతు బీమా సర్వే జూన్ 6న ప్రారంభమైంది. ఇది దాదాపు నెల రోజుల పాటు కొనసాగనుంది. వ్యవసాయ విస్తరణ అధికారులు.. పాసు పుస్తకం పొందిన, పెట్టుబడి చెక్కులు తీసుకున్న ప్రతి రైతు ఇంటికి వెళ్లి 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారిని గుర్తిస్తారు. అనంతరం ఆ రైతులకు నామినీ పత్రాలను అందజేస్తారు. నామినీ పత్రాలు నింపి రైతు సంతకం...

06 Jun

జూలై నుంచి “కుసుమ్” – రైతులకు సౌరవిద్యుత్ మోటార్లు

దేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిందే కుసుమ్ (కిసాన్ ఊర్జా సురక్షా ఏవమ్ ఉత్థాన్ మహాభియాన్) పథకం. సౌర విద్యుత్ వినియోగించేలా రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకం జూలై నుంచి అమల్లోకి రానుందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. రూ.1.4 లక్షల కోట్ల వ్యయంతో చేపడుతోన్న ఈ పథకంలో భాగంగా రైతులకు 27.5 లక్షల సౌర విద్యుత్ మోటార్లను ప్రభుత్వ అందజేయనుంది. కుసుమ్ పథకం ఇచ్చే సౌర విద్యుత్ మోటార్లు రెండు విధాలుగా ఉంటాయి. 17.5 లక్షల మోటార్ల వద్ద ఏర్పాటు చేసే సోలార్ ప్యానల్స్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ ను...

01 Jun

“కొబ్బరి” ఉత్పాదకతలో అగ్రగామిగా కొనసాగుతున్న భారత్

భారత సంస్కృతీ, సంప్రదాయాల్లో కొబ్బరి కాయకి అధిక ప్రాముఖ్యత ఉంది. ఇది.. సమృద్ధికి, సంపదకి, శుభానికి, పవిత్రతకు చిహ్నం. దేశ జీవ వైవిధ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది కాబట్టే.. కొబ్బరి ఉత్పత్తిలో భారత్ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా కొనసాగుతోంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాలు.. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2014 నుంచి 2018 వరకు కొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకతలో భారత్ గణనీయ పురోగతి సాధించిందని కేంద్రం లెక్కలు వెల్లడిస్తున్నాయి. భారత్ తర్వాతి స్థానంలో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్ ఉన్నాయి.    పెరిగిన ఉత్పత్తి, సాగు విస్తీర్ణం 2014 – 2018 మధ్య కాలంలో భారత్ లో కొబ్బరి సాగు గణనీయమైన అభివృద్ధి సాధించింది. 2013-14లో...

30 May

నైరుతి ఆగమనం

అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు మంగళవారం కేరళను తాకినట్లు భారత వాతావరణశా(ఐఎండీ) తెలిపింది. వచ్చే 48 గంటల్లో ఇవి కేరళలోని మిగతా ప్రాంతాలతోపాటు

08 Apr

ఇంటి పంటపై శిక్షణ కార్యక్రమం

‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగే రైతు శిక్షణా కార్యక్రమంలో 2018 ఏప్రిల్ 8వ తేదీ (ఆదివారం) ప్రత్యేకంగా టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హార్టీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్ మునిరెడ్డి, డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్న గూడెం సీనియర్ సైంటిస్ట్ ఎక్స్టెన్షన్ అండ్ హెడ్ శ్రీమతి డా. కరుణశ్రీ, ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి పాల్గొని టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్‌లో సేంద్రియ పద్దతిలో కూరగాయల పెంపకంపై అవగాహన కల్పిస్తారు. కేవలం 4 చదరపు అడుగుల్లో ఒక...

X