సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై ఖాదర్‌వలి సదస్సులు

ప్రగతి రిసార్ట్స్‌ రజతోత్సవాల్లో భాగంగా అక్టోబరు 28 ఆదివారం ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే అంశంపై ప్రత్యేక సదస్సును నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటలనుంచి నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని శిల్పారామం సంప్రదాయ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డబ్ల్యూ.ఆర్‌.రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ప్రగతి రిసార్ట్స్ అధినేత జీబీకే రావు, ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సిరిధాన్యాలు, కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యంపై ఖాదర్ వలి అవగాహన కల్పిస్తారు. అనంతరం… ప్రగతి రిసార్ట్స్ మరియు రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శిల్పరామం సంప్రదాయ వేదికలో దేశీయ ఆహారం, ఆధునిక రోగాల...