విదేశీ కూరగాయల సాగుకు చిరునామా నరసింహరాజు

గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే అప్పట్లో రవాణా సౌకర్యం అందుబాటులో లేని కారణాలు మరియు అనేక రకాల కారణాల వలన స్థానికంగా దొరికే ఆహారాలు మాత్రమే తింటూ జీవితాన్ని గడుపుతుండేవారు. కాని రాను రాను అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఒక చోట నుండి వేరే చోటికి రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావటంతో ఏ వస్తువైనా ఎలాంటి మారుమూల పల్లెలోనైనా అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ పరిణామాలు ఇంకొంత ముందడుగు వేసి గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో ప్రపంచంలో అన్ని ప్రదేశాలలో ఇతర ప్రాంతాలలో లభించే వస్తువులు కూడా అందుబాటులో ఉంటున్నవి. వ్యవసాయ రంగం కూడా దానికేమీ అతీతం కాకుండా ప్రస్తుత పరిస్థితులలో ఆయా దేశాలలో లభించని పండ్లు, కూరగాయలలాంటివి లభించే దేశాల నుండి...