training program

31 Oct

హైదరాబాద్‌లో మిద్దెతోటపై అవగాహన కార్యక్రమం

మిద్దెతోటను ప్రారంభించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…? కుండీలు, బకెట్లు, డ్రమ్ముల్లో ఇంటిపంటలను ఎలా పండించుకోవాలి…? మొక్కలకు సోకే చీడపీడలు, తెగుళ్లను నివారించే పద్ధతులేంటి…? ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో నవంబరు 03, శనివారం టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్‌లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బకెట్ గార్డెన్ నిపుణులు రవిచంద్ర పాల్గొంటారు. సేంద్రియ పద్ధతిలో ఇంటి పంటల పెంపకం విధానాలను వివరిస్తారు. మిద్దెతోటలపై సందేహాలను నివృత్తి చేస్తారు. రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిద్దెతోటను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. మిద్దెతోట చేపట్టేందుకు అవసరమైన...

11 Oct

ప్రకృతి సేద్యంలో చీడపీడల నివారణ మరియు భూసార పరిరక్షణపై అవగాహన కార్యక్రమం

ప్రకృతి సేద్యంలో చీడపీడలు, తెగుళ్లను నివారించే పద్ధతులపై సందేహాలున్నాయా…? భూసార పరిరక్షణ పద్ధతుల గురించి తెలుసుకోవాలని ఉందా…? అయితే రండి… మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది.. ప్రకృతి వ్యవసాయ విధానంలో చీడపీడల నివారణ మరియు భూసార పరిరక్షణపై అవగాహన కార్యక్రమం. గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో 2018 అక్టోబరు 14న ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. పదవీ విరమణ పొందిన వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు కె. రామచంద్రం పాల్గొని సేంద్రియ వ్యవసాయంలో చీడపీడల నివారణ మరియు భూసార పరిరక్షణపై అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా కొన్ని కషాయాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా తయారుచేసి చూపిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లతోపాటు వేస్ట్‌ డీకంపోజర్‌ను...

X