tsgovt

25 Oct

మిద్దెతోటలతో రసాయనిక ఆహారం నుంచి విముక్తి : తెలంగాణ సీఎస్ ఎస్‌.కె. జోషి

పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార అవసరాలను మిద్దెతోటల పెంపకం ద్వారా తీర్చే అవకాశాలు ఉన్నాయని, మిద్దెతోటల పెంపకమే సర్వత్రా శ్రేయస్కరమని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌.కె. జోషి చెప్పారు. రసాయనాలు, క్రిమిసంహారక మందుల వినియోగం లేకుండా కూరగాయలు, పండ్లు, పూలను సాగుచేసుకోవడం ద్వారా ఆహార అవసరాలను తీర్చుకోవడమే కాకుండా వివిధ వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చన్నారు. బుధవారం హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రాష్ట్ర ఉద్యానవనశాఖ, రైతునేస్తం ఆధ్వర్యంలో మిద్దెతోటల సాగు, వర్టికల్ గార్డెనింగ్‌పై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు జరిగింది. మిద్దెతోటల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేయూత అందిస్తోందని ఎస్‌.కె.జోషి తెలిపారు. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మిద్దెతోటల సాగుపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. రైతునేస్తం...

24 Sep

తెలంగాణలో 259 మక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

తెలంగాణలో పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా వానకాలం పంటల కొనుగోలుపై అధికారులతో ఆదివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. మక్కజొన్న నూర్పిళ్లు మొదలైన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. మక్కజొన్నల కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 259 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది 3 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేయగా, ఈసారి సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులు కొనేందుకు సన్నాహాలు చేయాలని సూచించారు. మార్కెట్ ధర తక్కువ ఉన్నప్పటికీ మద్దతు ధర రూ.1,700 ప్రకారమే రైతుల నుంచి నేరుగా కొనుగోలుచేస్తామని వివరించారు.   మినుములు, పెసర్లకు...

24 Sep

అక్టోబరు 20నాటికి తెలంగాణలో 98 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 98 పత్తి కొనుగోలు కేంద్రాలు తెరువాలని, వచ్చే నెల పదో తేదీలోగా 25 పత్తి కేంద్రాలను తెరవాలని అధికారులను మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఆదేశించారు. 20వ తేదీలోగా 98 కేంద్రాలు అందుబాటులోకి తేవాలని కోరారు. 288 జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. తెలంగాణ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం మార్కెటింగ్, వ్యవసాయ, మార్క్‌ఫెడ్, హాకా, గిడ్డంగుల సంస్థ, సీసీఐ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పత్తి, మక్కజొన్న, పెసర్లు, మినుముల కొనుగోళ్లపై ఆదేశాలు జారీచేశారు. ఖమ్మం జిల్లా నుంచి జిన్నింగ్ మిల్లుల యజమానులు సీసీఐ టెండర్లలో పాల్గొనకపోవడంపై మంత్రి ఆరా తీశారు. ఆ జిల్లాలో రైతులకు ఇబ్బందులు రాకుండా...

30 Aug

తెలంగాణలో యాసంగి విత్తన ప్రణాళిక ఖరారు

రాబోయే యాసంగికి విత్తన ప్రణాళికను తెలంగాణ వ్యవసాయశాఖ ఖరారుచేసింది. యాసంగికి 4.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనావేశారు. యాసంగి కోసం 3.16 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంచేయాలని నిర్ణయించారు. 25 వేల క్వింటాళ్లు సిద్ధంగా ఉండగా, విత్తనోత్పత్తి కింద 2.91 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, 64,880 క్వింటాళ్ల శనగలు, 8,666 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సిద్ధంచేశారు. మినుములు, ఆముదం విత్తనాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. శనగ, వేరుశనగ విత్తనాలకు క్వింటాకు 35 శాతం చొప్పున సబ్సిడీ ఇస్తారు. ...

30 Aug

అక్టోబరు 1నాటికి పత్తి కొనుగోలు కేంద్రాలు: హరీశ్‌

పత్తి మార్కెటింగ్ సీజన్ కోసం తెలంగాణ సర్కారు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అక్టోబర్ 1 నాటికి పత్తి కొనుగోలు కేంద్రాలను సిద్ధంచేయాలని అధికారులను తెలంగాణ మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. గత ఏడాది మాదిరిగానే జిల్లా కలెక్టర్లు ప్రకటించిన అన్ని కాటన్ జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటుచేయాలని సూచించారు. మద్దతు ధర కల్పించే విషయంలో పత్తి రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ గ్రాండ్‌లో వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, సీసీఐ చైర్మన్ అల్లిరాణి, సీసీఐ సంచాలకుడు చొక్కలింగం, మార్కెటింగ్ సంచాలకురాలు లక్ష్మిబాయి తదితరులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది పత్తి నుంచి దూదిశాతాన్ని సీసీఐ 33 శాతంగా...

18 Aug

సెప్టెంబరు నుంచి ఈ-నామ్‌ ద్వారా చింతపండు కొనుగోళ్లు

ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) పద్ధతిలో చింతపండు కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ మార్కెటింగ్‌శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. రైతు ప్రయోజనాలు, గిట్టుబాటు ధర కల్పన కోసం వ్యవసాయ ఉత్పత్తులను ఏకీకృత జాతీయ మార్కెట్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం రెండేండ్ల కిందట ఈ-నామ్‌ను ప్రారంభించింది. తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్, వరంగల్, బాదేపల్లి, హైదరాబాద్, తిర్మల్‌గిరి వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఎంపికచేసింది. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మలక్‌పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్‌కు ప్రధానంగా వచ్చే మిర్చి పంటను ఈ-నామ్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఎంపికచేసిన మరిన్ని మార్కెట్ కమిటీల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అధికారులు దీని పరిధిలోకి తెచ్చారు. మలక్‌పేట...

25 Jul

రైతుబీమా పథకంపై కలెక్టర్లకు తెలంగాణ సీఎస్‌ దిశానిర్దేశం

తెలంగాణ  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న రైతుబీమా పథకంలో ఇప్పటివరకు 26.38 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి తెలిపారు. మంగళవారం సచివాలయంలో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో జోషి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి మాట్లాడుతూ, రైతుబంధు చెక్కులు పొందిన రైతులందరినీ కలిసి అర్హులైన వారందరినీ బీమా పథకంలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తారని, అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభల ద్వారా రైతులకు బీమా సర్టిఫికెట్లు అందించాలని స్పష్టం చేశారు. రైతులకు బిందుసేద్యం పథకం అమలు వేగవంతం చేయాలని పార్థసారథి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు....

13 Jul

గేదెలు, ఆవుల పంపిణీ పథకంపై సర్కారు కసరత్తులు

పాడి రైతులకు సబ్సిడీపై ఇచ్చే బర్రెలు, ఆవుల కొనుగోలుకు టెండర్లు పిలవకూడదని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాటిని ఎలా కొనాలన్న దానిపై పశుసంవర్థకశాఖ అధికారులు రెండు రకాల పద్ధతులను ప్రభుత్వానికి నివేదించారు. ఒకటి టెండర్లు పిలవడం, మరొకటి నేరుగా లబ్ధిదారులతో వెళ్లి కొనుగోలు చేయడం. ఈ రెండింటిలో నేరుగా కొనుగోలు చేయడంవైపే సీఎం కేసీఆర్‌ మొగ్గు చూపినట్లు పశుసంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి. ఈ బర్రెలను ఎలా పంపిణీ చేయాలన్న దానిపై పశుసంవర్థకశాఖ మార్గదర్శకాలు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపినట్లు సమాచారం. సీఎం ఆమోదించాక పథకం ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం, ఇతర వర్గాలకు 50 శాతం రాయితీ రైతుల వాటా, ప్రభుత్వ వ్యయం కలిపి...

12 Jul

రాజేంద్రనగర్‌లో 24 ఎకరాల్లో ఔషధ మూలికా ఉద్యానం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో 24 ఎకరాల వైద్య ఆరోగ్యశాఖ భూమిలో ఔషధ మూలికా ఉద్యానాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉద్యానాన్ని సందర్శించే రోగులకు ఇక్కడి ప్రశాంత వాతావరణం, ఔషధ మూలికలు, మొక్కల ద్వారా వ్యాపించే వాసనలను పీల్చడం ద్వారా స్వస్థత చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఆయుష్‌ విభాగానికి చెందిన ఈ భూమిని ఔషధ మొక్కల మండలికి కేటాయిస్తూ వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ‘బయోసిన్‌మెడికా- రోగులకు స్వస్థతనిచ్చే కేంద్రం’పేరిట అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. సుమారు రూ.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేపట్టడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగించనున్నారు. ఉద్యానాన్ని కేవలం రోగుల కోసమే కాకుండా...

X