zbnf

25 Feb

మార్చి 1, 2, 3 తేదీల్లో “సేంద్రీయ ఉత్పత్తుల మేళా”

రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలతో వ్యవసాయం పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హానికరం సహజ సిద్ధంగా, సేంద్రియ విధానంలో సాగుతో పర్యావరణం పదిలం ప్రజల ఆరోగ్యం క్షేమం

02 Feb

కేంద్ర బడ్జెట్ లో రైతుకి జై.. ఏడాదికి రూ.6 వేల పెట్టుబడి పథకం

రైతునేస్తం: కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేసింది. తెలంగాణ ప్రభుత్వ బాటలోనే కేంద్రం కూడా రైతుబంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టనుందన్న అంచనాలను నిజం చేస్తూ.. తాజా బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 5 ఎకరాల లోపు (2 హెక్టార్లు) సాగు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయం అందించనుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలోకి బదిలీ చేస్తామని బడ్జెట్ లో పేర్కొంది. 2018...

09 Dec

గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరులో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు

అనారోగ్య సమస్యలతో బాధలా? బాగు చేసే మార్గం కోసం చూస్తున్నారా ? ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసం వెతుకుతున్నారా ? అయితే రండి.. మీ కోసమే రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి గారిచే సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమాలు గూడూరు, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, చిత్తూరు నగరాల్లో ఈ కార్యక్రమాల్లో కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని సిరిధాన్యాలు, కషాయాలతో షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తదితర రోగాల నిర్మూలన, నియంత్రణపై అవగాహన కల్పిస్తారు….. కార్యక్రమాల తేదీలు, వేదికలు…. ☛ గూడూరులో… డిసెంబర్ 9 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వేదిక : దవ్వూరు నారాయణరెడ్డి కమ్యూనిటీ హాల్, ఐ.సి.ఎస్. రోడ్, గూడూరు

26 Oct

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గిందని వ్యవసాయశాఖ అధికారులు గురువారం కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. రసాయన ఎరువుల వినియోగం 5.21 లక్షల మెట్రిక్‌ టన్నులు తగ్గగా, రైతులకు రూ.943.77 కోట్ల సొమ్ము ఆదా అయ్యిందని, కేంద్ర ప్రభుత్వానికి రూ.815.63 కోట్ల రాయితీ ఆదా అయ్యిందని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డి వివరించారు. పురుగు మందుల వినియోగం 2208.84 మెట్రిక్‌ టన్నులు తగ్గడంతో రూ.1933 కోట్లు రైతులకు ఆదా అయ్యిందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ ఏడాది 96 శాతం పంటను ఈ-క్రాప్‌ కింద నమోదు చేశామని, మిగిలిన 4 శాతాన్ని నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌లో 102 శాతం సూక్ష్మపోషకాలను రైతులకు పంపిణీ చేశామని, రబీలో 1.75...

25 Oct

సేంద్రియ పద్ధతిలో ముందుకు “సాగు”తున్న రైతు శ్రీనివాస్ రెడ్డి

ప్రకృతినేస్తం:   భారతదేశం వ్యవసాయక దేశం. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయ మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో 90 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ రంగంలో ఉండేవారు. కాని రాను రాను వేరే రంగాలకు మరలేవారు పెరిగినా కూడా ఇప్పటికీ కూడా వ్యవసాయరంగంపై ఆధారపడి జీవించేవారు 60 శాతానికి పైగా ఉన్నారనేది అక్షరసత్యం. వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన వారు కొంతమంది మొదటిలో వ్యవసాయ రంగంలో  ఉంటూ కొన్ని సంవత్సరాల తరువాత వేరే రంగాలకు మరలడం మరియు ఇతర రంగాలలో కొంతకాలం గడిపిన తరువాత మరలా వ్యవసాయ రంగంలో తిరిగి ప్రవేశించడం ఇటీవల సర్వసాధారణమైంది. ఇదే కోవకు చెందుతాడు నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం గట్ల మల్లేపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి. వ్యవసాయ...

25 Oct

మారుతున్న పద్ధతులకు అనుగుణంగా “వరిసాగు”

ప్రకృతినేస్తం: వ్యవసాయం ఒక మూస పద్ధతిలో కాకుండా మారుతున్న పరిస్థితులను పరిశీలించుకుంటూ అవకాశం ఉన్నంత వరకు ఆ వచ్చే మార్పులను ఆకళింపు చేసుకుంటూ పంటల సాగు కొనసాగించ గలిగినపుడే రైతు నిలదొక్కుకోగలడు. అలాకాకుండా ఒకే మూస పద్ధతిని గుడ్డిగా పాటించినట్లయితే వ్యవసాయంలో విజయం సాధించటం కష్టమవుతుంది. ప్రస్తుతం మారుతున్న కాలమాన పరిస్థితులు మరియు సాంకేతికత అభివృద్ధి చెందిన నేటి పరిస్థితులలో సమాచారం చాలా వేగవంతంగా ప్రపంచ నలుమూలలకు చేరుతుంది. ఈ పరిణామాన్ని వ్యవసాయంలో  ఉపయోకరంగా రైతులు మలచుకుంటున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ బాటలోనే నడుస్తూ ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వచ్చిన కొత్త పద్ధతులను ఉపయోగించుకుంటూ వరి పంటను సాగుచేస్తున్నాడు గుంటూరు జిల్లా చిర్రావూరుకి చెందిన నాగభూషణం. నాగభూషణం మొత్తం 6...

17 Sep

ప్రకృతి సేద్యంపై ప్రసంగించాల్సందిగా ఐక్యరాజ్యసమితి నుంచి చంద్రబాబుకి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం లభించింది. న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆయన్ని యూఎన్ఓ ఆహ్వానించింది. వ్యవసాయంలో ఆర్థిక సుస్థిరత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలపై సెప్టెంబరు 24న న్యూయార్క్‌లోని యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో జరిగే సదస్సులో ప్రసంగించాల్సిందిగా కోరుతూ ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు యూఎన్ఓ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ సోల్తెయిమ్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఏపీలో సేంద్రియ సాగుపై న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ఏపీలో అనుసరిస్తున్న సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల గురించి గతంలో న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ ప్రత్యేక కథనం కూడా ప్రచురించింది. ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం...

08 Sep

5లక్షల ఎకరాల్లో పెట్టుబడిలేని ప్రకృతి సేద్యం: చంద్రబాబు

రాష్ట్రంలో రైతు ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభలో స్పష్టం చేశారు. ఎంత కరవు పరిస్థితులున్నా 2 కోట్ల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా పూర్తి రాయితీపై విత్తనాలు ఇస్తున్నామని చెప్పారు. పత్తిలో గులాబీరంగు పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉద్ధృతిని గమనిస్తూ ప్రాంతాలవారీగా రైతులకు సూచనలు ఇస్తున్నామని తెలిపారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించడంతోపాటు సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 5 లక్షల ఎకరాల్లో జీరో బడ్జెట్‌ సాగు చేపట్టి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. పెట్టుబడిలేని ప్రకృతిసేద్య విధానంలో ఆవు పంచకం, సున్నపు నీరు చల్లి 3,500 హెక్టార్లలో పంటను కాపాడామని వివరించారు....

11 Jul

పెట్టుబడులు తగ్గితేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది: ఉపరాష్ట్రపతి

పెట్టుబడులు తగ్గి దళారీ వ్యవస్థకు తావు లేనప్పుడే రైతులు లాభపడతారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతితో మంగళవారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, పద్మశ్రీ సుభాష్ పాలేకర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు విజయ్ కుమార్ సమావేశ మయ్యారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనుసరించాల్సిన పద్దతులపై దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా వారు వెంకయ్యనాయుడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రకృతి వ్యవసాయం, జీరో బడ్జెటింగ్ నేచురల్ ఫార్మింగ్‌పై జరిగిన నీతి ఆయోగ్ సమావేశం గురించి గవర్నర్ ఆయనకు వివరించారు. ఈ మధ్యే పుణెలో జరిగిన “లాభసాటి వ్యవసాయం కోసం చేపట్టాల్సిన చర్యలు, విధానాలు’పై జరిగిన జాతీయ సదస్సు విశేషాలను ఉపరాష్ట్రపతి వారితో పంచుకున్నారు. త్వరలో ఇదే...

X