Spread the love

మిద్దెతోటపై ఆసక్తి ఉంది !!

కానీ ప్రారంభించేది ఎలా ?

ఏ మట్టి వాడాలి ?

పరికరాలు, విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ?

మొక్కలు పెంచేది ఎలా ?

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

ఇలా ఎన్నో సందేహాలకు సమాధానలు ఇచ్చి.. మిద్దెతోటల పెంపకంపై మీకు పూర్తి అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ హైదరాబాద్ లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా రైతునేస్తం కార్యాలయ ఆవరణ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, హైదరాబాద్ నందు 2019 ఆగస్టు 17న శనివారంటెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్ల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది.

కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం విశ్రాంత విస్తరణ సంచాలకులు ప్రొఫెసర్ రావి చంద్రశేఖర్, హైదరాబాద్ కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సేంద్రియ పద్ధతిలో ఇంటి పంటల పెంపకం విధానాలను వివరిస్తారు. మిద్దెతోటలపై సందేహాలను నివృత్తి చేస్తారు. మిద్దెతోట చేపట్టేందుకు అవసరమైన విత్తనాలు, మొక్కలు, పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రవేశం ఉచితం.. అందరూ ఆహ్వానితులే. రైతునేస్తం మోడల్ టెర్రస్ గార్డెన్ ను సందర్శించే అవకాశం కలదు.

ఈ అవగాహన కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. మరిన్ని వివరాలకు 7093 973 999, 9676 797 777 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.