Spread the love

మిద్దెతోటను ప్రారంభించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?

కుండీలు, బకెట్లు, డ్రమ్ముల్లో ఇంటిపంటలను ఎలా పండించుకోవాలి…?

మొక్కలకు సోకే చీడపీడలు, తెగుళ్లను నివారించే పద్ధతులేంటి…?

ఈ సందేహాలకు సమాధానమిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్‌. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌లోని రైతునేస్తం కార్యాలయంలో నవంబరు 03, శనివారం టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్‌లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బకెట్ గార్డెన్ నిపుణులు రవిచంద్ర పాల్గొంటారు. సేంద్రియ పద్ధతిలో ఇంటి పంటల పెంపకం విధానాలను వివరిస్తారు. మిద్దెతోటలపై సందేహాలను నివృత్తి చేస్తారు. రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిద్దెతోటను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. మిద్దెతోట చేపట్టేందుకు అవసరమైన విత్తనాలు, మొక్కలు, పరికరాలు, పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ అవగాహన కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. మరిన్ని వివరాలకు 7093 973 999, 9849312629 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.